Sunitha Rao Apology: క్షమించండి కాంగ్రెస్ నాయకత్వానికి సునీతారావు విజ్ఞప్తి
ABN , Publish Date - May 28 , 2025 | 05:06 AM
గాంధీభవన్‌లో జరిగిన సంఘటనపై సునీతారావు బాధ వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్నారనే వార్తలను ఖండిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): గాంధీభవన్‌లో జరిగిన సంఘటన బాధాకరమని, పెద్ద మనసుతో తమను క్షమించాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌లకు, పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం సునీతారావు మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమమన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని ఆమె తెలిపారు.