Telangana High Court : అసైన్డ్ భూములపై సబ్ రిజిస్ట్రార్‌కు అధికారం లేదు
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:11 AM
అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, అసైన్డ్ భూమి అని తేలితే
బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టండి
రంగారెడ్డి కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, అసైన్డ్ భూమి అని తేలితే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. మూడునెలల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టంచేసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని సర్వే 176/23లో అంతారం లక్ష్మయ్యకు 33 గుంటల అసైన్డ్ భూమి ఉంది. వారసుల మధ్య వివాదం నేపథ్యంలో కొంతమంది వ్యవసాయేతర భూమిగా మార్చి విక్రయించారు. వి వాదాస్పద భూమి అసైన్డ్ భూమి అన్న విషయాన్ని దాచిపెట్టి విక్రయించడంపై మరికొంత మంది వారసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమంగా భూ బ దిలీ చేస్తే ఆరునెలల జైలుశిక్ష లేదా 10వేల జరిమానా లే దా రెండూ విధించవచ్చని పేర్కొంది. ప్రస్తుత కేసుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.