Share News

విద్యార్థినులు అన్ని అంశాల్లో ప్రతిభ కనబర్చాలి

ABN , Publish Date - Feb 04 , 2025 | 12:52 AM

కస్తూర్బాగాంధీ విద్యాలయాల విద్యార్థినులను విద్య, క్రీడలు, అన్ని అంశాల్లో రాణించేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కేజీబీవీల సూచించా రు.

విద్యార్థినులు అన్ని అంశాల్లో ప్రతిభ కనబర్చాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కస్తూర్బాగాంధీ విద్యాలయాల విద్యార్థినులను విద్య, క్రీడలు, అన్ని అంశాల్లో రాణించేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కేజీబీవీల సూచించా రు. కేజీబీవీ ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమా వేశంలో ఆమె మాట్లాడారు. కేజీబీవీలోని విద్యార్థుల ఆహారం, విద్య, నిర్వహణ, తదితర అన్ని అంశాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. జేఈఈ మెయిన్స్‌, ఎన్‌ఐటీ, నీట్‌ తదితర ఎంట్రన్స్‌ పరీక్షల కు వారిని సన్నద్ధం చేయాలన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి ఐదుగురు విద్యార్థినులకు సైన్స్‌ ఎక్స్పోలకు తీసుక వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కేజీబీవీల అంతర క్రీడా పోటీలతోపాటు, జోనల్‌ స్థాయిలో నిర్వహించే క్రీడల్లో విద్యార్థినిలు ప్రతి భ కనబరిచే విధంగా తయారు చేయాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, డీఈవో భిక్షపతి, జీసీడీవో సరిత ఉన్నారు.

Updated Date - Feb 04 , 2025 | 12:52 AM