Dogs attack: ఎనిమిది మందిపై పిచ్చికుక్కలు దాడి.. బాధితుల్లో చిన్నారులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:02 PM
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్డుపై ఉన్న ఎనిమిది మందిపై పిచ్చికుక్కలు దాడికి దిగాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులతోపాటు పెద్దవారి పైనా దాడి చేశాయి.
సిద్దిపేట, నవంబర్ 1: గ్రామ సింహాల దాడిలో చిన్నారులు గాయపడిన ఘటన శనివారం సిద్దిపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్డుపై ఉన్న ఎనిమిది మందిపై పిచ్చికుక్కలు దాడికి దిగాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులతోపాటు పెద్దవారిపైనా దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు నిఖిల్, శ్రేయాన్స్, మనోజ్, నిత్యా శ్రీ, హారికతోపాటు వృద్ధులు బాలవ్వ, మైసయ్య గాయపడ్డారు. గ్రామస్తులు కుక్కల భారినుంచి వారిని రక్షించారు.
గాయపడిన వారిని వెంటనే దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడితో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రోడ్డుపైకి వెళదామంటే జంకుతున్నారు. ఏ కుక్క ఎటువైపునుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదని భయంతో ఉన్నారు. కుక్కల బారి నుంచి అధికారులు తమను రక్షించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డి అలవాట్లు అందరికి ఉండవు: తలసాని ఫైర్
KTR: కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారు: కేటీఆర్