Stephen Ravindra: పౌర సరఫరాల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:39 AM
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర... సోమవారం బాధ్యతలు స్వీకరించారు....
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర... సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కమిషనర్‌గా, కార్పొరేషన్‌కు వీసీ- ఎండీగా పనిచేసిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి చౌహాన్‌కు... అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (మల్టీజోన్-2)గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దీంతో సోమవారం డీఎస్ చౌహాన్ రిలీవ్ అయ్యారు. ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ నరసింహరాజు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ హన్మంతుజండేజ్ కొండిబా, అదనపు డైరెక్టర్ రోహిత్‌సింగ్ సహా అధికారులు... పౌరసరఫరాల భవన్‌లో చౌహాన్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.