Youth Empowerment : ఉపాధి రంగాలవైపు యువతను ప్రోత్సహిస్తాం
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:30 AM
భారీగా ఉపాధి అవకాశాలున్న రంగాలవైపు రాష్ట్ర యువతను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. మెరైన్ రంగంలో దేశంలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): భారీగా ఉపాధి అవకాశాలున్న రంగాలవైపు రాష్ట్ర యువతను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. మెరైన్ రంగంలో దేశంలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలున్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పాఠ్యాంశాల్లోనూ మార్పులు చేస్తున్నామని, పరిశ్రమలతో అనుసంధానం అవుతున్నామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన నూతన సంవత్సర డైరీ, టేబుల్ క్యాలెండర్‌ను ఆయన.. వైస్ చైర్మన్లు ఆచార్య ఈ.పురుషోత్తం, ఆచార్య ఎస్‌కే.మహమూద్‌లతో కలిసి విడుదల చేశారు. అనంతరం బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ దిశగా ఈ నెల 7, 8న హెచ్‌ఐసీసీలో జాతీయస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఉపాధి అవకాశాలు ఎక్కువుండే మరిన్ని కోర్సులు ప్రారంభిస్తామని, ఇందులో బీఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కూడా ఉందని తెలిపారు.