Telangana Government: రూ.1000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:23 AM
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంటు పెట్టింది.
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంటు పెట్టింది. 35 ఏళ్ల కాల పరిమితితో ఈ అప్పు సెక్యూరిటీ బాండ్లను రిలీజ్ చేసింది. ఈ నెల 12న ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించనుంది. రాష్ట్రంతో కలిపి దేశంలోని 6 రాష్ట్రాలు మొత్తం రూ.8,450 కోట్ల అప్పుల కోసం ఇండెంట్లు పెట్టాయి.