Share News

6.5 డిగ్రీలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:27 AM

రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-20 డిగ్రీల మధ్య నమోదు కాగా...

6.5 డిగ్రీలు

సిర్పూర్‌లో నమోదైన ఉష్ణోగ్రత

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-20 డిగ్రీల మధ్య నమోదు కాగా... తాజాగా అవి సగానికి పడిపోయాయి. గురువారం పలు జిల్లాల్లో 10 డిగ్రీల లోపునకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అక్కడ 6.5 డిగ్రీలు నమోదు కాగా.. ఇదే జిల్లా తిర్యాణి మండలంలో 6.6 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కొహిర్‌లో 6.9, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 7.1, భీంపూర్‌లో 7.2, తలమడుగులో 8.5, పిప్పల్‌ధరిలో 8.8, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌మేట్‌లో 7.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 7.5, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 8, నిర్మల్‌ జిల్లా పెంబిలో 8.5, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9 డిగ్రీలు, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో 9.1 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో 9.9, ములుగు జిల్లా మల్లంపల్లిలో 10.8, వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటలో 11.1, జనగామ జిల్లా కేంద్రంలో 11.4, మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తగూడలో 11.4 డిగ్రీలు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో 13 డిగ్రీలలోపు రికార్డు అయ్యాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో సాధారణంకంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - Jan 04 , 2025 | 05:27 AM