Share News

Vakiti Srihari: స్పోర్ట్స్‌ స్కూళ్లకు గొప్ప పేరు తేవాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:10 AM

రాష్ట్రంలోని స్పోర్ట్స్‌ స్కూళ్లకు గొప్ప పేరు వచ్చేలా కోచ్‌లు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.

Vakiti Srihari: స్పోర్ట్స్‌ స్కూళ్లకు గొప్ప పేరు తేవాలి

  • విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి: వాకిటి శ్రీహరి

శామీర్‌పేట, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్పోర్ట్స్‌ స్కూళ్లకు గొప్ప పేరు వచ్చేలా కోచ్‌లు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. విద్యార్థులను ప్రపంచస్థాయిలో అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. మంగళవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలోని రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ను రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్‌) చైర్మన్‌ శివసేనారెడ్డి, శాట్‌ ఎండీ, వీసీలతో కలిసి ఆయన సందర్శించారు.


అనంతరం మంత్రి, చైర్మన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలను చేశారు. మధ్యాహ్నం క్రీడాకారులతో కలిసి భోజనంచేశారు. అంతకు ముందు స్కూల్‌లోని కిచెన్‌ను మంత్రి పరిశీలించారు. కుళ్లిపోయిన కూరగాయలు, పురుగులు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్‌ కాంట్రాక్టర్‌ను వెంటనే తొలగించాలని, అతన్ని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.

Updated Date - Jul 02 , 2025 | 05:10 AM