క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:50 AM
అనునిత్యం విధులలో ఉంటే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
ఘనంగా ముగిసిన పోలీస్ వార్షిక క్రీడలు
ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన ఆర్మడ్ రిజర్వ్ టీమ్
జగిత్యాల క్రైం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : అనునిత్యం విధులలో ఉంటే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజిగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బందిలో నూతనోత్సహాన్ని నింపడం కోసం పోలీస్ పరేడ్ మె ౖదానంలో నిర్వహిస్తున్న పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025 క్రీడలు శుక్రవారం తో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా రెండవ రోజు క్రీడలను ప్రధాన న్యాయమూర్తి క్రీడా జ్యోతి వెలిగించి విజేతలకు బహుమతులు ప్రధానం చేసి మాట్లాడారు. ఎంతో పని ఒత్తిడితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరమన్నారు. మంచి ఆరో గ్యం క్రీడల ద్వారానే లభిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి స్పోర్ట్స్ మీ ట్‌లు మరిన్ని నిర్వహించి ప్రతి పోలీస్ ఉద్యోగి పాల్గోనేలా చూడాలన్నారు. అ నంతరం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు స హజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ఓవరాల్ చాంపియన్‌గా ఆర్మ్‌డ్ రిజర్వు టీం నిలువగా, టగ్ ఆఫ్ వార్‌లో విన్నర్‌గా ఆ ర్మ్‌డ్ రిజర్వు టీమ్, రన్నర్‌గా జగిత్యాల సబ్ డివిజన్ టీమ్ నిలిచింది. వాలీ బాల్‌లో విన్నర్‌గా ఆర్మ్‌డ్ రిజర్వు టీమ్, రన్నర్‌గా జగిత్యాల సబ్ డివిజన్ టీ మ్, క్రికెట్‌లో విన్నర్‌గా ఆర్మ్‌డ్ రిజర్వు టీమ్, రన్నర్‌గా మెట్‌పెల్లి సబ్ డివి జన్ టీమ్ నిలిచింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రఘ చందర్, రాములు రంగారెడ్డి, ఏవో శశికళ, ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాస్, ఆరీ ఫ్‌అలీ ఖాన్, రఫీ ఖాన్ సీఐలు వేణు గోపాల్, రాంనర్సింహా రెడ్డి, నిరంజన్ రెడ్డి, రవి, కృష్ణారెడ్డి, సురేష్, ఆర్‌ఐలు కిరణ్ కుమార్, వేణు, రామకృష్ణ ఉన్నారు.