School Education: దేశభక్తి పెంచేలా స్వాతంత్య్ర దిన కార్యక్రమాలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:47 AM
విద్యార్థుల్లో దేశభక్తి పెంచేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
పది, ఇంటర్ టాపర్లకు నగదు పురస్కారాలు
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లో దేశభక్తి పెంచేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, అందులో ఎన్‌సీసీ పెరేడ్‌తోపాటు దేశభక్తి పెంచేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ బుధవారం డీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పది, ఇంటర్‌లో జిల్లా టాపర్లుగా నిలిచిన ఇద్దరు బాల, బాలికలకు రూ. 10 వేల చొప్పున నగదు పురస్కారాలు అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కార్యక్రమాల ఏర్పాటు, నగదు పురస్కారాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.