ఆస్తిపన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:29 AM
రామగుండం కార్పొరేషన్‌లో ఆస్తిపన్ను వసూలు చేస్తున్న అధికారులు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో మార్చిలోపు 100శాతం ఆస్తిపన్ను వసూలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి చెప్పారు. బుధవారం కార్పొరేషన్‌లో మొండి బకాయుయిదారుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిం చారు. పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నాటికి ప్రైవేట్ ఆస్తుల ఇంటి పన్ను 53శాతం, ప్రభుత్వ ఆస్తుల నుంచి 92శాతం వసూ లు కాగా ఏళ్ల తరబడి వసూళ్లు కాని భారీ బకాయిలను వసూలు చేయ డానికి రెవెన్యూ చట్టం ప్రకారం ఇచ్చిన నోటీసులకు స్పందన వచ్చిందని, ఇదే తరహాలో మొండి బకాయిదారులకు నోటీసులు ఇచ్చి ఫిబ్రవరిలోగా చెల్లించకపోతే చట్ట ప్రకారం ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందన్నారు.