Gaddam Prasad Kumar: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం తీర్పు ప్రతి అందలేదు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:36 AM
ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయమై సుప్రీంకోర్టు తీర్పు ప్రతి తనకింకా చేరలేదని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తాండూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయమై సుప్రీంకోర్టు తీర్పు ప్రతి తనకింకా చేరలేదని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ తండాలో శుక్రవారం జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయమై మీరే నిర్ణయం తీసుకుంటున్నారు’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. కోర్టు తీర్పు పత్రాలు తనకందిన తర్వాత స్పందిస్తానన్నారు.
ప్రతి ఏటా బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించడంతోపాటు బీసీ ప్లాన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ తన పరిధిలోకి రాదని, దానిపై ఆర్థిక మంత్రిని అడగాలని ప్రసాద్ కుమార్ సమాధానం దాటవేశారు. స్పీకర్ వెంట తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా ఉన్నారు.