South Central Railway: దసరా-దీపావళి కోసం 170 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:23 AM
దసరా, దీపావళి, ఛత్ పండుగల రద్దీ దృష్ట్యా 170 ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది
హైదరాబాద్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి, ఛత్ పండుగల రద్దీ దృష్ట్యా 170 ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అక్టోబర్ 6నుంచి నవంబర్ 24 వరకు (సోమ) చర్లపల్లి-రక్సౌల్(07705) మధ్య 8 రైళ్లు, అక్టోబర్ 9నుంచి నవంబర్ 27వరకు(గురు) రక్సౌల్- చర్లపల్లి(07006) మధ్య 8 రైళ్లు, సెప్టెంబర్ 7నుంచి 28వరకు(ఆది) తిరుపతి-చర్లపల్లి(07481) మధ్య 4 రైళ్లు, సెప్టెంబర్ 8నుంచి 29వరకు(సోమ) చర్లపల్లి-తిరుపతి(07482) మధ్య 4 రైళ్లు నడుపుతారు.
సెప్టెంబర్ 5నుంచి 26వరకు(శుక్ర) చర్లపల్లి-తిరుపతి(07011)మధ్య 4 రైళ్లు, సెప్టెంబర్ 6నుంచి 27వరకు(శని) తిరుపతి-చర్లపల్లి(07012) మధ్య 4 రైళ్లు, నర్సాపూర్-ఎ్‌సఎంవిటి బెంగుళూరు(07153) 13 రైళ్లు, అక్టోబర్ 4నుంచి డిసెంబర్ 27వరకు(శుక్ర) ఎస్‌ఎంవిటి బెంగుళూరు-నర్సాపూర్-(07154) 13 రైళ్లు, అక్టోబర్ 1నుంచి నవంబర్ 26వరకు(బుధ) తిరుపతి-హిసార్(07717)మధ్య 9రైళ్లు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.