Devadula Project: దేవాదుల ప్రతిపాదనల తిరస్కరణ
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:24 AM
దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లోని ప్యాకేజీ-3కి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎ్‌సఎల్‌ఎస్సీ) తిరస్కరించింది.

మళ్లీ తగిన రీతిలో సమర్పించాలని ఎస్‌ఎల్‌ఎస్సీ ఆదేశం
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లోని ప్యాకేజీ-3కి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎ్‌సఎల్‌ఎస్సీ) తిరస్కరించింది. ప్యాకేజీ-3లో చెన్నూరు, పాలకుర్తి చెరువులకు సంబంధించిన ప్రతిపాదనలు రాగా... పలు ఉల్లంఘనలు ఉన్నట్లు ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలోని ఎస్‌ఎల్‌ఎస్సీ గుర్తించింది. దాంతో తగిన రీతిలో ప్రతిపాదనలను సమర్పించాలని శుక్రవారం సిఫారసు చేసింది.