Share News

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం స్థల పరిశీలన

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:05 AM

మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చే సేందుకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం రెడ్‌కో సంస్థ మేనేజర్‌ శ్రీమన్నారయణ, డీఆర్‌డీవో కిషన్‌ పరిశీలించారు. ఒక మేఘావాట్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించే సోలార్‌ పవర్‌ ప్లాంటు కోసం నెన్నెల శివారులోని సర్వేనంబరు 672లో 4 ఎకరాల భూమిని కేటాయించా రు.

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం స్థల పరిశీలన
సోలార్‌ పవర్‌ ప్లాంటు కోసం భూమి పరిశీలిస్తున్న అధికారులు

నెన్నెల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చే సేందుకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం రెడ్‌కో సంస్థ మేనేజర్‌ శ్రీమన్నారయణ, డీఆర్‌డీవో కిషన్‌ పరిశీలించారు. ఒక మేఘావాట్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించే సోలార్‌ పవర్‌ ప్లాంటు కోసం నెన్నెల శివారులోని సర్వేనంబరు 672లో 4 ఎకరాల భూమిని కేటాయించా రు. సౌర విద్యుత్‌ ఉత్పత్త్తికి స్థలం అనుకూలంగా ఉందని, రెండు కిలోమీటర్ల దూరంలోనే 33-11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉండటంతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ విక్రయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, డీపీఎం సంజీవ్‌, ఏపీఎంలు విజయలక్ష్మి, పంజాల ప్రకాష్‌గౌడ్‌, ఏపీవో నరేష్‌, ఎంఆర్‌ఐ సులోచన తదితరులున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:05 AM