RTC Driver Sister Surprises: రాఖీ.. రైట్ రైట్
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:24 AM
డ్యూటీలో ఉన్నాను.. ప్బ్.. రాఖీ సంబురానికి దూరమయ్యానే అన్న దిగులు ఆ ఆర్టీసీ డ్రైవర్‌కు దూరమైంది.
డ్యూటీలో ఉన్నాను.. ప్బ్.. రాఖీ సంబురానికి దూరమయ్యానే అన్న దిగులు ఆ ఆర్టీసీ డ్రైవర్‌కు దూరమైంది. ఆయన చెల్లెలే బస్టాండ్‌కు వచ్చి.. అన్న నడుపుతున్న బస్సు కోసం ఎదురుచూసి మరీ రాఖీ కట్టింది. నారాయణ అనే డ్రైవర్‌దీ కొండత సంతృప్తి. ఆయన కామారెడ్డి డిపోలో పనిచేస్తున్నారు. సోదరి మెదక్ జిల్లా రామయంపేటలో ఉంటున్నారు. డ్యూటీలో భాగంగా నారాయణ రామాయంపేట మీదుగా వెళుతున్నాడని తెలుసుకొని ఆమె అక్కడి బస్‌స్టాండ్‌కు వెళ్లారు. అన్న రాగానే ఆమె ఆయనకు బొట్టు పెట్టి రాఖీ కట్టారు. ఇదీ కదా.. అన్నాచెల్లెళ్ల అనురాగం అంటూ ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు.