బంజారాహిల్స్‌లో దర్జాగా సర్కారు భూమి కబ్జా
ABN , Publish Date - May 23 , 2025 | 04:32 AM
బంజారాహిల్స్ రోడ్ నం.14లోని 403/2 సర్వే నంబర్ పరిధిలో ఎకరం భూమి విలువ రూ.100 కోట్లు. దీనిపై షేక్ జహంగీర్ అనే వ్యక్తి కన్ను పడింది. ఆ భూమి తనదేనని గురువారం ఆక్రమించుకున్నాడు.
100 కోట్ల విలువైన భూమిపై జహంగీర్ కన్ను
బంజారాహిల్స్,మే 22 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ రోడ్ నం.14లోని 403/2 సర్వే నంబర్ పరిధిలో ఎకరం భూమి విలువ రూ.100 కోట్లు. దీనిపై షేక్ జహంగీర్ అనే వ్యక్తి కన్ను పడింది. ఆ భూమి తనదేనని గురువారం ఆక్రమించుకున్నాడు. అతడి మనుషులు ’ఈ స్థలం జహంగీర్‌ది ఇందులోకి ప్రవేశిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుం టాం’ అని హెచ్చరిక కూడా చేశారు.
దీనిపై షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ఆ స్థలం స్వాధీనం చేసుకుని జహంగీర్‌పై చట్ట ప్రకారం చర్య లు తీసుకుంటామని చెప్పారు. గతంలోనూ ఈ భూమిని ఆక్రమించడానికి యత్నించిన జహంగీర్‌ను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారం క్రితం మరోసారి ఆ స్థలాన్ని ఆక్రమించిన జహంగీర్‌పై రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసు నమోదైంది.