Share News

పౌరసరఫరాల శాఖలో డీఎస్‌‌వోల బదిలీలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:09 AM

రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో పలువురు డీఎస్‌వోలు బదిలీ అయ్యారు. జగిత్యాల డీఎస్‌వోగా వెంకటేష్‌, నల్గొండ డీఎ్‌సవోగా రఘునందన్‌, వికారాబాద్‌ డీఎస్‌వోగా సుదర్శన్‌

పౌరసరఫరాల శాఖలో డీఎస్‌‌వోల బదిలీలు

  • అవినీతిపరులకు అందలమని ఆరోపణలు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో పలువురు డీఎ్‌సవోలు బదిలీ అయ్యారు. జగిత్యాల డీఎస్‌వోగా వెంకటేష్‌, నల్గొండ డీఎస్‌వోగా రఘునందన్‌, వికారాబాద్‌ డీఎస్‌వోగా సుదర్శన్‌, హైదరాబాద్‌ డీఎస్‌వోగా శ్రీనివాస్‌, నిర్మల్‌ డీఎస్‌వోగా రాజేందర్‌, సంగారెడ్డి డీఎ్‌సవోగా రాజేశ్వర్‌, సూర్యాపేట డీఎ్‌సవోగా మోహన్‌బాబు, పెద్దపల్లి డీఎ్‌సవోగా శ్రీనాథ్‌లకు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ బదిలీలపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులుగా కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్న డీఎ్‌సవోలపై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో బదిలీల ప్రక్రియ చేపట్టారనే చర్చ ఒకవైపు జరుగుతుండగా... ఆరోపణలు వచ్చినవారిపై చర్యలు తీసుకోకుండా, వారు కోరుకున్న స్థానాలకు బదిలీలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


నిర్మల్‌ డీఎ్‌సవోగా పనిచేస్తూ ఇప్పటికే మూడుసార్లు సస్పెండైన కిరణ్‌కుమార్‌ను జయశంకర్‌ భూపాలపల్లికి బదిలీ చేశారు. ఇటీవల సూర్యాపేట జిల్లా నుంచి వికారాబాద్‌ జిల్లాకు బదిలీ అయిన మోహన్‌బాబును... ఆరు నెలలు కూడా పూర్తికాకముందే తిరిగి సూర్యాపేట జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. నారాయణపేటలో సస్పెండైన డీఎ్‌సవో సుదర్శన్‌ను కొద్ది రోజుల్లోనే వికారాబాద్‌ జిల్లా డీఎ్‌సవోగా నియమించడంలో ఆంతర్యమేమిటనే చర్చ పౌరసరఫరాల శాఖలో జరుగుతోంది.

Updated Date - Jul 03 , 2025 | 05:09 AM