ఏడు జిల్లాల్లో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయాలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:29 AM
రాష్ట్రానికి మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలకు వీటిని మంజూరుచేశారు.
రాష్ట్రానికి మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలకు వీటిని మంజూరుచేశారు. వీటి ప్రారంభంపై సోమవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోల్‌సతోపాటు నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ టి.గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్లు టి.సూర్యప్రకాశ్, బి.చక్రపాణి చర్చలు జరిపారు. వచ్చే నెల 14 నుంచి అన్ని వసతులతో పూర్థిస్థాయిలో తరగతులు ప్రారంభిస్తామని, త్వరలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని యోగితా రాణా తెలిపారు.