శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:04 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు శనివారంతో రెండో రోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

భువనగిరి అర్బన్, జనవరి 11(ఆంధ్ర జ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు శనివారంతో రెండో రోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం వేణుగోపాల(కృష్ణాలంకారం) స్వామికి దివ్య ప్రబంధ పారాయణాలు, సాయంత్రం గోవర్ధన గిరిధారి ద్రావిడ ప్రబంధ పారాయణాలను పారాయణికులు పఠిస్తుండగా ప్రధానార్చకులు ప్రధా నార్చకులు నల్లందీఘల్ లక్ష్మీనరసింహ చార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఉత్సవాలు వైభవంగా నిర్వహి ంచారు. వేడుకల్లో ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్క రాయణీ నరసింహమూర్తి, ఏఈవో నవీన్, పర్యవే క్షకులు రాజన్‌బాబు, రామరావు ఉన్నారు.
శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరిగాయి. సుప్ర భాతసేవతో గర్భా లయంలో కొలువుదీరిన స్వయంభువులను మేల్కొలిపిన అర్చ కులు ప్రతిష్టామూ ర్తులను వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించారు. సాయంత్రం ప్రధా నాలయ ముఖ మండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు సహస్ర నామార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్య కైంకర్యాలు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని సమే తా రామలింగేశ్వరస్వామికి మహామండపంలో స్ఫటికమూర్తులకు నిత్యారా ధనలు, యాగశాలలో నిత్య రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొన సాగాయి.