Gurukul Education: గురుకులాలకు భవనాల సమస్య పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:00 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థలకు త్వరలో భవనాల సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యేలా..
నిధుల విడుదలకు కృషి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థలకు త్వరలో భవనాల సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్‌వోఆర్) అమలు తీరుపై ఆయన హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జోనల్ అధికారులతో ముఖాముఖి చర్చించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో పలు ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.