అభివృద్ధి పనులకు మోక్షం
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:30 PM
జిల్లా కేంద్రంలో పలు అభివ ృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రూ. 199కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఈ నెల 6వ తేదిన జీవో నంబర్ 99ను జారీ చేశారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పనులకు మో క్షం కలిగినట్లయింది.

జిల్లా కేంద్రంలో వివిధ పనులకు రూ.199 కోట్లు మంజూరు
జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆరులేన్ల రహదారికి విస్తరణకు గ్రీన్ సిగ్నల్
గోదావరిపై వంతెన నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
మంచిర్యాల, మార్చి 7(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో పలు అభివ ృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రూ. 199కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఈ నెల 6వ తేదిన జీవో నంబర్ 99ను జారీ చేశారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పనులకు మో క్షం కలిగినట్లయింది. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కృషితో జిల్లా కేంద్రంలో ఆరులైన్ల రహదారి విస్తరణ, గోదా వరిపై వంతెనతో పాటు పలు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఆరులేన్ల రహదారి విస్తరణ...
జిల్లా కేంద్రంలోని లక్ష్మీటాకీస్ చౌరస్తా నుంచి రాళ్లవాగు మీదుగా రంగంపేట వరకు, అక్కడి నుంచి పాత మంచిర్యాల-అండాలమ్మ కాలనీ వ రకు ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించి పాత మంచిర్యాల వల్ల ఎన్‌హెచ్-63 రహదారికి అ నుసంధానం చేయనున్నారు. రహదారి విస్తరణ లో భాగంగా బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమ రవీరుల స్తూపం వద్ద రాళ్లవాగుపై ఉన్న కాజ్‌వే వంతెన స్థానంలో హైలెవల్ వెంతెన నిర్మాణం కూడ చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో బెల్లం పల్లి వైపు నుంచి ఐబీ చౌరస్తా మీదుగా లక్షెట్టిపే ట వైపు వెళ్లే, లక్షెట్టిపేట నుంచి బెల్లంపల్లి వైపు వచ్చిపోయే వాహనాలు ప్రస్తుతం ఉన్న బైపాస్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అసలే ఇరు కు రోడ్లు కావడం వాహనాల రద్దీ విపరీతంగా ఉండడంతో తరుచుగా ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. బైపాస్ రోడ్డు చుట్టుపక్కల నివాసముం డే ప్రజలు కూడ వాహనాల రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీటాకీస్ చౌరస్తా నుంచి అమరవీరుల స్తూపం వరకు అధికంగా ట్రాఫిక్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆ రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ప్రజలకు ఇబ్బందులు త ప్పనున్నాయి. అలాగే కాజ్‌వే స్థానంలో హైలెవల్ వెంతెన నిర్మాణం జరుగనుండడంతో పాత మం చిర్యాల, రంగంపేట, అండాలమ్మ కాలనీ, పవర్ సిటీ కాలనీ ప్రజలకు రాకపోకలకు సులువు కా నున్నాయి. అలాగే అండాలమ్మ కాలనీ నుంచి పాత మంచిర్యాల ఎన్‌హెచ్-63 వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించి ఉం డడంతో ఆయా కాలనీల ప్రజలకు రవాణ సౌక ర్యం మరింత మెరుగుపడనుంది. కాగా పాత మంచిర్యాల వద్ద రోడ్డు విస్తరణ జరుగనుండ డంతో స్థానికంగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్న వారికి కొంత మేర నష్టం వాటిల్లే అవ కాశాలు ఉన్నాయి. రోడ్డును ఆనుకొని ఉన్న ఇండ్లను తొలగిం చాల్సి రావడంతో ప్రజలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫగోదావరిపై వంతెనకు ఎట్టకేలకు మోక్షం...
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరిపై మంచిర్యాల-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ అంతర్‌జిల్లా వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభిచింది. ఇంతకుముందు గోదావరిపై మంచిర్యాల- అం తర్గాం మధ్య రూ.169కోట్లతో వంతెన నిర్మాణానికి పరిపాలన అను మతులు రాగ 2023 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చు వల్‌గా ప్రారంభించారు. పనులు ప్రారంభించే దశలో ఉండగా అని వార్యకారణాల వల్ల ఆ వంతెన రద్దయింది. ప్రస్తుతం వంతెన నిర్మా ణానికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ డంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద గో దావరిపై వంతెన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు మం జూర య్యాయి. ముల్కల్ల-అంతర్గాం వద్ద ఈ వంతెనను నిర్మించనుండగా నేరుగా బసంతనగర్ వద్ద జాతీయ రహదారితో అనుసంధానం చేయ నున్నారు. ఈ వంతెన నిర్మాణం జరిగితే మంచి ర్యాల నుంచి బసంత్‌నగర్ వరకు కేవలం 15 నిమిషాల వ్యవధిలో ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. ఇప్పటి వరకు బసంత్‌నగర్‌కు చేరుకో వాలంటే మంచిర్యాల నుంచి గోదావరిఖని మీదుగా 45 నిమిషాలు పాటు ప్రయాణించాల్సి వచ్చేది. వంతెనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సుమారు 20కిలోమీటర్ల మేర దూరభారం తగ్గనుంది. ఆసిఫాబాద్ జిల్లా వాసులతోపాటు బెల్లంపల్లి, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నూతనవంతెన పై నుంచి ఎలాంటి ట్రాఫి క్ ఇబ్బందులు లేకుండా నేరుగా బసంత్‌నగర్ వెళ్లేందుకు అవకాశం లభిస్తోంది.
జాతీయ రహదారి విస్తరణకూ మోక్షం...
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి క్యాతన్‌పల్లి వరకు ఉన్న రహదారిని కూడ ఆరు వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు లభించాయి. క్యాతన్‌పల్లి వద్ద ఇప్పటికే ఉన్న చంద్రాపూర్-శ్రీరాంపూర్ హైవే వరకు రోడ్డును విస్తరించనున్నారు. దీంతో మంచిర్యాల నుంచి క్యాతన్‌పల్లి వరకు ఇప్పటి వరకు రెండు వరుసల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు రోడ్డు విస్తరణతో కష్టాలు తీరనున్నాయి. ఆయా పనులకు పరిపాలన అనుమతులు ప్రభుత్వం జారీ చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.