నివాస స్థలాలకూ‘ రైతు బంధు’
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:38 AM
పెద్దఅడిశర్లపల్లి,జనవరి20(ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దే శంతో గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కొందరు అనర్హులకు కాసుల వర్షం కురిపించింది.
పెద్దఅడిశర్లపల్లి,జనవరి20(ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దే శంతో గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కొందరు అనర్హులకు కాసుల వర్షం కురిపించింది. అయితే కాంగ్రెస్ ప్రభు త్వం రైతు భరోసా ఇవ్వడానికి సాగుకు యో గ్యం కాని భూములను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించ డానికి సర్వే చేపట్టింది. ఈ క్రమంలో పెద్ద అడిశర్లపల్లి, గుడిపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చేపట్టిన రైతు భరోసా సర్వేల్లో అనేక అవక తవకలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఉమ్మడి పీఏపల్లి మండలంలోని హైవే పక్కన ఉన్న అంగడిపేట ఎక్స్‌రోడ్డు, అక్కంపల్లి, ఘన పురం, రోళ్లకల్లు, చిలకమర్రి ప్రాంతాల్లో ఆది వారం వరకు నిర్వహించిన సర్వేల్లో కొన్ని అక్రమాలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 240 ఎక రాల్లో వెంచర్లు ఆ భూముల్లో ఇంటి నిర్మా ణాలు, భవనాల నిర్మాణం జరిగినట్లు సర్వేలో తేలింది. ఈ నిర్మాణాలు జరిగి కూడ దాదాపు పదేళ్లు దాటి పోయింది. అయితే అసలు విష యం ఏమిటంటే ఇలాంటి భూములకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం వరకు రైతుబంధు పథకానికి సంబంధించిన నగదు ఖాతాల్లో జమ అయింది. ప్రస్తుతం నిర్వహించిన సర్వేల్లో ఇలాం టి భూముల వివరాలు సేకరించిన అధి కారులు ఆయా భూముల యజమానులకు సమాచారం అందించడమే కాకుండా ఇకపై మీకు రైతు భరోసా నగదు జమ కాకుండా తొల గించి సమా చారం అందిస్తున్నారు. కొంద రు స్వచ్ఛందంగా తొలగించాలని చెబుతున్నారని, మరికొందరు అధికారుల హెచ్చరికలతో తొల గించాలని అని పేర్కొంటున్నట్లు సర్వే అధి కారులు తెలిపారు. ఇలా కేవలం ఉమ్మడి పీఏ పల్లి మండలంలోనే కాకుండా జాతీయ రహ దారిపైన ఉన్న ఇతర మండలాల్లో రైతుబంధు పథక నిధులు నివాస ప్రాంత భూములకు చేరినట్లు తెలుస్తుంది.
గ్రామ సభలు నిర్వహించి ఆ తర్వాత తొలగిస్తాం
ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి వ్యవసా యేతర భూములు, వెంచర్లను గ్రామసభలో చదివి వినిపిస్తాము. గ్రామ సభల ఆమోదం ప్రకారం అట్టి భూములను, నాలా కన్వన్షన్ లేని వెంచర్స్‌ను తొలగిస్తాం. రైతు భరోసాను అపివేస్తాము. అందరూ సహకరించాలి.
- రమణారెడ్డి ,ఆర్డీవో, దేవరకొండ