Share News

Heavy Rains: నిజామాబాద్‌కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులు రద్దు

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:19 AM

వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్‌కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.

Heavy Rains: నిజామాబాద్‌కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులు రద్దు

చాదర్‌ఘాట్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్‌కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. కామారెడ్డి మార్గంలో రోడ్లపై వరద ప్రవాహంతోపాటు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దాంతో ఈ రూట్లలో నడిచే ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే 9 ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Updated Date - Aug 29 , 2025 | 04:19 AM