Share News

రోడ్ల అభివృద్ధికి రూ.91కోట్లు మంజూరు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:46 PM

కల్వ కుర్తి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.91 కోట్ల 50లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.

రోడ్ల అభివృద్ధికి రూ.91కోట్లు మంజూరు
విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి

కల్వకుర్తి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : కల్వ కుర్తి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.91 కోట్ల 50లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో రోడ్లను దశల వారీగా అభివృద్ధి ప రుస్తామని పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి మండలంలోని యంగం పల్లి నుంచి జిల్లెల వరకు బీటీ రోడ్డు నిర్మాణా నికి రూ.2కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ పీడబ్ల్యూడీ రోడ్డు నుం చి శ్రీరామ్‌నగర్‌ వరకు రూ.4కోట్లు, జీడిపల్లి నుంచి ఎల్లికట్ట వరకు రూ.3కోట్లు, పంజుగుల నుంచి తర్నికల్‌ వరకు రూ.3కోట్ల 60లక్షలు, కల్వకుర్తి నుంచి పంజుగు ల రోడ్డులో బ్రిడ్జి నిర్మాణా నికి రూ.2కోట్ల 50లక్షలు, గుండూరు నుంచి సుద్దక ల్‌ మధ్యలో బ్రిడ్జి నిర్మాణా నికి రూ.3కోట్లు, గుండూ రు నుంచి రంగాపూర్‌ వ యా ముకురాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్ల 40లక్షలు మంజూరై నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెల్దండ మండలంలో వెల్దండ నుంచి రాచూర్‌ వరకు రూ.5కోట్ల 20లక్ష లు, దొంగ రోడ్డు నుంచి రాచూర్‌ తండా, తిమ్మినోని పల్లి వరకు రూ.95 లక్షలు, బైరాపూర్‌ నుంచి అజిలాపూ ర్‌ వరకు రూ.4కోట్ల 80లక్షలు, వెల్దండ నుంచి కుప్పగండ్ల, కంటోనిపల్లి వరకు రూ.4కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొ న్నారు. చారకొండ మండలంలో వెల్దండ నుంచి జూపల్లి, జూపల్లి నుంచి పోతేపల్లి వరకు రూ.10కోట్ల 50లక్షలు, బైరాపూర్‌ నుంచి గోకారం, చంద్రాయన్‌పల్లి వరకు రూ.4కోట్ల 48లక్షలు, జేపీనగర్‌ నుంచి జంగారెడ్డిపల్లి, తిమ్మరాసిపల్లి వరకు రూ.25కోట్ల 65లక్షలు, చంద్రాయన్‌పల్లి నుంచి చారకొండ వరకు రూ.48కోట్ల 50లక్షలు బీటీ రోడ్ల నిర్మాణా లకు మంజూరైనట్లు ఎమ్మె ల్యే పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయ తీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు బృంగి ఆనంద్‌కుమార్‌, ఎన్నం భూపతిరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, విజయ్‌ కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి సం జీవ్‌కుమార్‌ యాదవ్‌, కిషన్‌రెడ్డి, నరసింహ, శ్రీనివాస్‌రెడ్డి, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:46 PM