కోదాడ బస్టాండ్ ఆధునీకరణకు రూ.17.95 కోట్లు
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:10 AM
కోదాడ రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఆధునీకరణ పనుల కోసం రూ. 17.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోదాడ రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఆధునీకరణ పనుల కోసం రూ. 17.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 6న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి బస్టాండ్, కోదాడ డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనాడు డిపోను, బస్టాండ్‌ను పరిశీలించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోదాడ బస్టాండ్ ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేయాలని, బస్టాండ్‌కు జాతీయ రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని, బస్టాండ్‌లో కూడా ప్రయాణికుల కోసం అదనపు ఏసీ గదులు ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతికి రవాణా మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోదాడ బస్టాండ్ ఆధునీకరణ పనుల కోసం రూ. 17.95 కోట్లు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటుగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషితో బస్టాండ్ ఆధునీకరణ పనుల కోసం నిధుల మంజూరీతో పాటు డిపోకు కూడా ఐదు పల్లెవెలుగు బస్సులు, ఒక ఏసీ బస్సును మంజూరు చేశారు. దీంతోపాటుగా మంత్రి ఉత్తమ్ కృషితో రవాణా మంత్రి బస్టాండ్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పద్మావతి ఇరువురు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.