రోళ్లవాగును మరో కాళేశ్వరంగా మార్చారు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:50 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోళ్ల వాగును మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని, కమీషన్లకు ఆశపడి డబ్బులు దోచుకోవడానే రీడిజైనింగ్ పేరు తెరపైకి తెచ్చారని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కమీషన్లకు ఆశపడి డబ్బులు దోచుకోవడానికే రీడిజైనింగ్ పేరు
ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
బీర్‌పూర్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోళ్ల వాగును మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని, కమీషన్లకు ఆశపడి డబ్బులు దోచుకోవడానే రీడిజైనింగ్ పేరు తెరపైకి తెచ్చారని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ గోదావరి లిఫ్ట్‌పై ఆ ధారపడి సుమారు 15వేల ఎకరాలకు పైగా పంట సాగుచేస్తున్నారన్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు తగ్గి పోవ డంతో సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు తమ దృష్టికి తేవడంతో రోళ్లవాగు ప్రాజెక్ట్‌ను పరిశీలించామన్నారు. ఈ సమస్యను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక్క టీఎంసీ నీటినీ విడుదల చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రోళ్ల వాగు విషయంలో ఇరిగేషన్, ఫారెస్టు అధికారులు, కాంట్రాక్టర్ మధ్య సమన్వయం లేక పోవడం వల్లే కొంత సమస్య ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని 60 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి దాన్ని 140 కోట్లుకు పెంచి మరో కాళేశ్వరం ప్రా జెక్ట్‌గా మార్చారన్నారు. డబ్బులు దోచుకోడానికి తప్ప ప్రాజెక్టును పూర్త చేసి రైతులుకు సాగు నీరు అందించాలన్న గత ప్రభుత్వ పాలకులకు లేదన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రాజెక్టు నుంచితా త్కాలిక ప్రాతిపదికన నీరు అందిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రోళ్లవాగు ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఫారెస్టు నుంచి అనుమతి పొందడానికి ప్రతిపాదన ఎస్టిమేట్ పొందుపరచాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లామన్నారు. ప్రత్యామ్నాయ ల్యాండ్ సమకూర్చడానికి కలెక్టర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. అనంతరం చిన్న కొల్వాయి గ్రామంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదే సమయంలో చిన్న కొల్వాయి పాఠశాలలో మధ్యహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడి గి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీర్‌పూర్ మాజీ ఎంపీపీ మసర్తి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మన్ రావ్, కొల్వాయి సింగిలివిండో చైర్మన్ నవీన్ రావ్, ధ్మపురి నాయకులు చిల్ముల లక్ష్మన్, ధర్మపురి మండల కాం గ్రెపార్టీ ఉపాధ్యక్షులు కోల రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సు భాష్ యాదవ్ పాల్గొన్నారు.