Share News

Gastroenterology: ఏటా 60 వేల ఉదర క్యాన్సర్‌ కేసులు

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:08 AM

ప్రపంచ వ్యాప్తంగా ఉదర క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని, మన దేశంలో ఏటా 60 వేల కొత్త కేసులు వస్తున్నాయని యశోద ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు తెలిపారు.

Gastroenterology: ఏటా 60 వేల ఉదర క్యాన్సర్‌ కేసులు

  • యశోద ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు

  • హైటెక్‌ సిటీలో ‘జీఐ-ఫోకస్‌’ వర్క్‌షాప్‌ షురూ

హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా ఉదర క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని, మన దేశంలో ఏటా 60 వేల కొత్త కేసులు వస్తున్నాయని యశోద ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు తెలిపారు. హైటెక్‌ సిటీలోని యశోద ఆస్పత్రిలో ‘జీఐ-ఫోకస్‌’ పేరుతో రెండు రోజుల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లైవ్‌ వర్క్‌షా్‌పను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎస్‌ రావు మాట్లాడారు.


సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, రొబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ.. ఈ సదస్సులో అధునాతన జీర్ణ, ఉదరకోశ శస్త్ర చికిత్సలపై నిపుణుల నేతృత్వంలో నిర్వహించే లైవ్‌ సెషన్లు యువ సర్జన్లకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 05:08 AM