Female Voters : రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:28 AM
ఎన్నికల సంఘం ప్రకటించిన సవరణ ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం విడుదల చేసిన ఈ

మొత్తం ఓటర్లు 3,35,27,925 మంది
మహిళలు 1,68,67,735, పురుషులు 1,66,41,489 మంది
సవరించిన ఓటర్ల జాబితా వెల్లడించిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం ప్రకటించిన సవరణ ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 1,68,67,735, పురుషులు 1,66,41,489, థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. 7,65,982 మందితో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి నిలిచింది. తర్వాతి స్థానంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (7,45,155 మంది ఓటర్లు) ఉంది. అతితక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 18-19 ఏళ్ల వయసున్న 5,45,026 మంది ఓటు హక్కు పొందారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 2,22,091, దివ్యాంగులైన ఓటర్లు 5,26,993, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,591 మంది ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం వెల్లడించిన జాబితాతో పోల్చితే.. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,90,318 పెరిగింది. పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా గతంలో ఉన్న 35,358 పోలింగ్ స్టేషన్లకు అదనంగా 551 పెంచడంతో వాటి సంఖ్య 35,907కు చేరింది.