Share News

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:15 AM

ప్ర భుత్వ ఉద్యో గం చేస్తూ ఇటీవల పద వీ విరమణ పొందినఉ ద్యోగ, ఉపాధ్యాయలకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్‌ వెంటనే ఇప్పించాలని రిటైర్డ్‌ ఉద్యోగ ఉపాధ్యాయులు సిలిగిరి రామకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి కట్టబత్తుల గణేష్‌ డిమాండ్‌ చే శారు.

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలి

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణారెడ్డి, గణేష్‌

నల్లగొండటౌన, ఫిబ్రవ రి 2 (ఆంధ్రజ్యోతి): ప్ర భుత్వ ఉద్యో గం చేస్తూ ఇటీవల పద వీ విరమణ పొందినఉ ద్యోగ, ఉపాధ్యాయలకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్‌ వెంటనే ఇప్పించాలని రిటైర్డ్‌ ఉద్యోగ ఉపాధ్యాయులు సిలిగిరి రామకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి కట్టబత్తుల గణేష్‌ డిమాండ్‌ చే శారు. పట్టణంలోని పీఆర్టీయూ భవనలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాది కాలంగా నిధులు విడుదల కాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రిటైర్డ్‌ అయిన ప్రతి ఉపాధ్యాయ, అధ్యాపకులకు రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే బెనిఫిట్స్‌ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తమకు రావాల్సిన బెనిఫిట్స్‌ తక్షణమే వచ్చే విధంగా ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ధీమా వ్య క్తం చేశారు. సమావేశంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కె.వెంకట్‌రెడ్డి, మహమ్మద్‌ ముస్తఫా, అలీఖాన, ఇంద్రసేనారెడ్డి, ప్రతాపరెడ్డి, వందనం వెంకట్‌రెడ్డి, ముజాహిద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:15 AM