Share News

పెన్షనర్ల వ్యతిరేక వైఖరి మానుకోవాలి

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:22 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛనుదారుల పట్ల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం పేర్కొంది.

పెన్షనర్ల వ్యతిరేక వైఖరి మానుకోవాలి

  • రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛనుదారుల పట్ల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం పేర్కొంది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌ నారాయణ, నర్సరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పింఛనుదారుల కోసం ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.


నాలుగు డీఏలను, పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొత్త పీఆర్‌సీలో పింఛనుదారులకు తీవ్ర అన్యాయం చేసేలా కొత్త చట్టాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి 23న లేఖలు రాయనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 04:22 AM