Share News

భువన్‌ సర్వే పునఃప్రారంభం

ABN , Publish Date - Mar 03 , 2025 | 11:43 PM

రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రవేశ పెట్టిన భువన్‌ సర్వే మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. సర్వేలో భాగంగా ఉపగ్రహ ఆధారిత ఫొటోలు తీయడం తో పాటు ఆస్తి పన్నుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సి బ్బంది పర్యటించి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు

భువన్‌ సర్వే పునఃప్రారంభం

పట్టణాల్లో పక్కాగా ఆస్తుల వివరాల నమోదు

2020లో తొలిసారి ప్రారంభించిన అప్పటి ప్రభుత్వం

అనివార్య కారణాల వల్ల అర్థాంతరంగా నిలిచన సర్వే

మిగిలిన పని పూర్తి చేసేందుకు అధికారుల సన్నాహాలు

మంచిర్యాల, మార్చి3 (ఆంరఽధజ్యోతి) : రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రవేశ పెట్టిన భువన్‌ సర్వే మళ్లీ ప్రారంభం కానుంది. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. సర్వేలో భాగంగా ఉపగ్రహ ఆధారిత ఫొటోలు తీయడం తో పాటు ఆస్తి పన్నుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సి బ్బంది పర్యటించి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. అసస్‌మెంట్‌ వాస్తవ విస్తీర్ణానాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా పన్ను విధించే వెసులుబాటు భువన్‌ సర్వేయాప్‌ ద్వారా కలుగనుంది. ప్రతి ఆస్తికి ప ది అంకెల ప్రాపర్టి టాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబరు (పీటీ ఎన్‌) కేటాయిస్తారు. సర్వే కారణంగా ఆస్తులకు సం బంధించి ఏ మాత్రం తేడా లేకుండా సరిపడ పన్ను వి ఽధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా యజమా నులకు ఎక్కువ తక్కువ ఆస్తి పన్నులు నమోదు చేసేం దుకు అవకాశం ఉండదు. దీని వల్ల ఆస్తికి సరిపడ ప న్ను చెల్లించాల్సి రావడంతో యజమానికి నష్టం కలిగే అవకాశాలు తొలగిపోతాయి.

అవకతవకలకు అడ్డుకట్ట...

రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థలు ప్రతి సంవత్స రం దాదాపు రూ. 900కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తు న్నాయి. అయితే పన్ను విధింపులో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో యజమానులు స్థానిక సిబ్బందితో కుమ్మక్కై ఆస్తి విలువ, వైశాల్యం తక్కువగా చూపించడం ద్వారా ఆస్తి పన్నులో తగ్గింపులు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాణిజ్యపరమైన ఆస్తిని కొన్ని ప్రాంతాల్లో నివాస గృహాలుగా చూపించికూడ పన్ను తగ్గింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు కొన్ని సందర్భాల్లో ఆస్తి విలువకు అదనంగా పన్ను విధి స్తున్న సందర్భాలు కూడ ఉన్నాయి. ఇలాంటి అవకత వకలకు చెక్‌పెట్టే ఉద్దేశ్యంతోనే ప్రతి ఆస్తిని ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్‌ చేయాలని తలపెట్టి 2020లోనే లాంచనంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను అప్పటి ప్రభు త్వం ప్రారంభించింది.

నిలిచిన సర్వే...

ఇదిలా ఉండగా 2020లో ప్రారంభించిన భువన్‌ సర్వే కొంతకాలం పాటు సక్రమంగా సర్వే నిర్వహించినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది పూర్తిగా నిలిచిపోయింది. కరోన కారణంగా దాదాపు రెండేళ్లపాటు సర్వే నిలిచిపో వడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సర్వే ప్రారంభించిన కొత్తలో జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల అసస్‌మెంట్లను గుర్తించగా అం దులో సుమారు 20 వేల వరకు సర్వే పనులు పూర్తి చేశారు. మిగితా మొత్తం పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తరువాత 2023లో సర్వేను తి రిగి ప్రారంభించినప్పటికీ సాంకేతిక లోపం కారణంగా మళ్లీ అంతరా యం ఏర్పడింది.

ఫపునఃప్రారంభానికి సన్నాహాలు...

2020లో ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయిన భువన్‌యాప్‌ స ర్వేను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ కొనసాగించాలని నిర్ణయించింది. దీం తో అధికారులు తిరిగి ఆ పనులు చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నా రు. అయితే పంచాయతీ ఎన్నికలు కూడానిర్వహించాల్సి ఉండడంతో సర్వే ఎలక్షన్ల తరువాత నిర్వహిస్తారా...? లేక ఈ లోపే చేపడతారా.. అ న్న విషయంలో స్పష్టత లేదు. అప్పుడు నిలిచిపోయే వరకు మిగిలి ఉ న్న సుమారు 20 వేల అసస్‌మెంట్స్‌ సర్వే ప్రస్తుతం చేపట్టాల్సి ఉంది. కాగా ఈ విషయమై అధికారులకు కూడా పూర్తి స్పష్టత లేకపోవడంతో పంచాయతీ ఎన్నికల తరువాతనే భువ న్‌సర్వే నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. భువన్‌ సర్వే పూర్తయితే స్థానిక సంస్థలకు భారీగా ఆదా యం సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలం కింది స్థాయి సి బ్బందితో కుమ్మక్కై తక్కువ పన్ను విధించేలా ఏర్పాట్లు చేసుకున్న య జమానులకు మాత్రం 2020 నుంచి కోల్పోయిన మొత్తాన్ని స్థానిక సం స్థలు వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 03 , 2025 | 11:43 PM