Chava Ravi: కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:08 AM
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, మేధావులపై ఉందని ఎస్‌టీఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శి...
ఎస్‌టీఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, మేధావులపై ఉందని ఎస్‌టీఎ్‌ఫఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌టీఎ్‌ఫఐ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో రవి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.