Share News

గోదావరిలోకి నీటి విడుదల గొప్ప నిర్ణయం

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:06 AM

గోదావరిలోకి నీరు విడుదల అనేది గొప్ప నిర్ణయమని ప్రభుత్వ విప్‌, ధ ర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

గోదావరిలోకి నీటి విడుదల గొప్ప నిర్ణయం
దమ్మన్నపేట వద్ద గోదావరి నది లిఫ్ట్‌ ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ అడ్లూరి

పంటల సాగు చేసేందుకు రైతులకు ఢోకా లేదు

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): గోదావరిలోకి నీరు విడుదల అనేది గొప్ప నిర్ణయమని ప్రభుత్వ విప్‌, ధ ర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండ లంలోని దమ్మన్నపేట వద్ద గోదావరి నదిలోకి ఎస్సారెస్పీ నీటి విడుదల చేసినందుకు గురువారం ఆయన నదీ మా తకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి చిత్రపటాలకు రైతులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పంట పొలాలకు నీరందించే గోదావరి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఆయన ప్రారం భించారు. అనంతరం ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు మార్‌ మాట్లాడుతూ నదిలో నీరు లేక పంటల సాగుకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని రైతులు తన దృష్టికి తెచ్చా రన్నారు. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి గోదావరిలోకి ఒక టీ ఎంసీ నీరు విడుదల చేయాలని వినతి పత్రాన్ని ఇచ్చానన్నారు. వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నీరు విడుదల గురించి చర్చించారని తెలిపారు. ఒక దశలో నీ టి విడుదల కష్టం అని చెప్పినా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరి గేషన్‌ శాఖ అధికారులతో ఏ పద్ధతిలో నీరు విడుదల చేస్తే జగిత్యాల, ధర్మపురి ప్రాం తాలకు నీరు అందుతుందో తన అనుభవం ద్వారా వివ రించారన్నారు. దీంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒప్పు కొని జగ్గసాగర్‌ నుంచినీటిని విడుదల చేయాలని అధి కారులను ఆదేశించడంతో వెంటనే నీటిని విడుదల చేశా రన్నారు. రైతులు అధైర్య పడవద్దని పంట సాగు కోసం ఎలాంటి ఢోకా లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ స భ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగనభట్ల దినేష్‌, మండల ఉపాధ్యక్షులు వేముల రాజేష్‌, జక్కు ర వీందర్‌, దమ్మన్నపేట మాజీ ఎంపీటీసీ తోడేటి గంగాధ ర్‌, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు చిలుముల ల క్ష్మణ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కుంట సుధాకర్‌, యువ జన కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు అప్పం తిరుపతి, జక్కు ల తిరుపతి, అరికిల్ల సతీష్‌, ముత్యాల గంగాధర్‌, గొల్లపెల్లి సత్తయ్యగౌడ్‌, జంగిలి ప్రభాకర్‌, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 01:06 AM