Share News

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:27 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు
ప్రాకార మండపంలో నిత్య కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

భువనగిరి అర్బన్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభూవు లను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకించి తులసీ దళాలతో సహాస్రనార్చనలు జరిపారు. ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామిఅమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలి పూజలతో నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండిజోడు సేవలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఖజా నాకు వివిధ విభాగాల ద్వారా రూ.18,10,991ల ఆదాయం సమ కూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలుగు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ నిత్యానందరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయగా వేద పండితులు వేద ఆశీర్వాదం చేసి లడ్డు ప్రసాదం అందజేశారు.

Updated Date - Jan 30 , 2025 | 12:27 AM