కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:26 AM
యువజన కాంగ్రె్‌సలో కష్టపడి ప నిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని, యువజన కాంగ్రె్‌సలో మంచి వక్త అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి అన్నారు.

కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి
నల్లగొండ టౌన, జనవరి 16(ఆంధ్రజ్యోతి): యువజన కాంగ్రె్‌సలో కష్టపడి ప నిచేసే వారికి మంచి గుర్తింపు భవిష్యత్తు ఉంటుందని, యువజన కాంగ్రె్‌సలో మంచి వక్త అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి అన్నారు. అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన యంగ్ ఇం డియా కే బోల్ కార్యక్రమం సీజన-5 కి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆ యన మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఎదిగేందుకు యువజన కాంగ్రెస్ పునాది లాంటిదని పేర్కొన్నారు. ఇప్పుడున్న మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులు చాలామంది మొదట యువజన కాంగ్రె్‌సలో పనిచేసిన వారేనని ఆయన తెలిపారు. పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టినా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి మాట్లాడుతూ యువజన కాం గ్రెస్ నిర్వహిస్తున్న యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమం యు వతకు రాజకీయం, సామాజిక సమస్యలు, దేశ అభివృద్ధిపై చర్చించే ప్రత్యేక వేదికగా రూపొందించబడిందని తెలిపారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తిరుగుడు రవియాదవ్, షేక్ జహంగీర్ బాబా, జాల మణికంఠస్వామి, వల్కి దిలీప్, అబ్బనబోయిన రాముయాదవ్, రఘుమారెడ్డి, కిన్నెర హరికృష్ణ, మల్‌రెడ్డి భా నుచందర్‌రెడ్డి, నాగరాజు, అజారుద్దీన, మంచికంటి సిద్ధార్థ, ఆనంద్, దాసరి విజయ్, నందిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.