Minister Ponnam Prabhakar: పాపన్న తరహాలో రాహుల్ గాంధీ పోరాటం
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:31 AM
సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్వాయి పాపన్న ఉద్యమించినట్లు ఈనాడు బీసీలందరినీ కలుపుకుని రాహుల్‌గాంధీ,..
సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్వాయి పాపన్న ఉద్యమించినట్లు ఈనాడు బీసీలందరినీ కలుపుకుని రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజ్యాంగానికి లోబడి రిజర్వేషన్లు సాధించుకోవడానికి కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. విద్యను అందిస్తే భవిష్యత్తు తరాలను నిర్మించినట్లేనని అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. నిత్యం బహుజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడుతున్న సీఎం రేవంత్.. రెడ్డి మాత్రమే కాదని, గౌడ్ కూడా అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సాహసం, ధైర్యానికి ప్రతీక సర్వాయి పాపన్న అని కొనియాడారు.
పాపన్న విగ్రహానికి శంకుస్థాపన
ట్యాంక్ బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వెనుక భాగంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.