Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:49 PM

ల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాల యంలో మంగళవారం నాగర్‌కర్నూల్‌, తెల్కప ల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారు లకు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులను అందజేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి

- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాల యంలో మంగళవారం నాగర్‌కర్నూల్‌, తెల్కప ల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారు లకు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నా రు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, ఎండీ.నిజాముద్దీన్‌, జక్కా రాజ్‌ కుమార్‌, తీగల సునేంద్ర, సుల్తాన్‌, నాయకులు కోటయ్య, బాదం నరేందర్‌ పాల్గొన్నారు.

నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పనుల పరిశీలన

జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మిస్తున్న నాన్‌వెజ్‌ మా ర్కెట్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. నిర్మా ణ పనుల పురోగతిని మునిసిపల్‌, ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోకి తేవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు కొత్త శ్రీనివాసులు, తీగల సునేంద్ర, నిజాముద్దీన్‌, జక్క రాజ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు నరేం దర్‌ ఉన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:49 PM