Share News

Pending Bills: మాట తప్పితే ఉద్యమ కార్యాచరణే

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:26 AM

ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల రూ.700 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సిన సర్కారు.. గత నెలలో కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించిందని పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి ఆరోపించారు.

Pending Bills: మాట తప్పితే ఉద్యమ కార్యాచరణే

  • పెన్షనర్ల పెండింగ్‌ బిల్లులపై ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల రూ.700 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సిన సర్కారు.. గత నెలలో కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించిందని పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి ఆరోపించారు. కనుక 2 నెలలకు కలిపి రూ.1,220 కోట్లు వెను వెంటనే చెల్లించాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి పెండింగ్‌ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.


పీఆర్‌టీయూఎస్‌ అధ్యక్షుడు గుండు లక్ష్మణ్‌ అధ్యక్షతన శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లించాలని కోరారు. ఇక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 04:26 AM