Share News

చెత్తబండ్లను అడ్డుకుని నిరసన

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:29 PM

బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి కాసిపే ట మండలంలోని సోమగూడెం 1వ గని సమీపంలో చెత్తను పారేయడానికి వచ్చిన చెత్తబండ్లను శుక్రవారం స్ధానిక యువకులు అడ్డుకుని నిరసన తెలిపారు. గత కొంత కాలంగా బెల్లంపల్లి చెత్తను కాసిపేట పరిసర ప్రాంతాల్లో పడేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

చెత్తబండ్లను అడ్డుకుని నిరసన
చెత్తబండ్లను అడ్డుకుని నిరసన తెలుపుతున్న స్ధానిక యువకులు

కాసిపేట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి కాసిపే ట మండలంలోని సోమగూడెం 1వ గని సమీపంలో చెత్తను పారేయడానికి వచ్చిన చెత్తబండ్లను శుక్రవారం స్ధానిక యువకులు అడ్డుకుని నిరసన తెలిపారు. గత కొంత కాలంగా బెల్లంపల్లి చెత్తను కాసిపేట పరిసర ప్రాంతాల్లో పడేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. మళ్లీ శుక్రవారం చెత్త వాహనాలను తీసుకుని వస్తుండగా సోమగూడెం టోల్‌గెట్‌ వద్ద స్ధానికులు చెత్త వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్‌ పరిధిలో చెత్తను పారవేయకుండా 15 కిలోమీటర్లదూరంలో ఉన్న సోమగూడెంలో చెత్తను పడేయడానికి రావడం ఏంటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్ధానికులను సముదా యించేందుకు చూడగా యువకులు చెత్త ట్రాక్టర్‌ టైర్లలో గాలి తీయడంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు బెల్లంపల్లి మున్సిపల్‌ కమీష నర్‌తో ఫోన్‌లో మాట్లడారు. చెత్తను సోమగూడెంలో పడేయమని కమీషనర్‌ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో స్ధానికులు రాజం, రాజు, సది, ఎల్లయ్య, ధర్మయ్య, గణేష్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:29 PM