Share News

అడవులను కాపాడుతూ..వన్యప్రాణులను సంరక్షిస్తూ..

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:42 PM

అటవీ శాఖ అధికారులు వన్య ప్రాణులను సంరక్షించ డంతో పాటు అడవులను కాపాడడంలో తీసుకుంటున్న సత్పలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని చెన్నూ రు, బెల్లంపల్లి అటవీ డివిజన్‌ పరిధిలో కుష్నపల్లి, నీల్వాయి రేంజ్‌లు ఉన్నాయి.

అడవులను కాపాడుతూ..వన్యప్రాణులను సంరక్షిస్తూ..
నీల్వాయి అడవిలో నీటి కుంట వద్ద చుక్కల దుప్పి

సత్ఫలితాలు ఇస్తున్న అటవీ అధికారుల చర్యలు

వేమనపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : అటవీ శాఖ అధికారులు వన్య ప్రాణులను సంరక్షించ డంతో పాటు అడవులను కాపాడడంలో తీసుకుంటున్న సత్పలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని చెన్నూ రు, బెల్లంపల్లి అటవీ డివిజన్‌ పరిధిలో కుష్నపల్లి, నీల్వాయి రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలోని అ ట వీ అదికారులు వన్య ప్రాణులను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లోని వన్య ప్రా ణులను సంరక్షించేందుకు అధికారులు అక్కడికక్కడ పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి నీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తుండడంతో ఆ కుంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతూ వన్యప్రాణుల దాహార్తీని తీరుస్తున్నారు. అడవుల్లో సోక్‌పిట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అగ్ని నియంత్రణ చర్యలు సైతం చేపడుతున్నారు. వేసవి కాలం కావడంతో అడవుల్లో అగ్ని ప్రమా దాలు జరిగి చెట్లు, మొక్కలు కాలిపోకుండా సైత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భా గంగా అధికారులు ఫైర్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వన్య ప్రాణులను రక్షించుకునేందుకు కరెంటు వై ర్లు, ఉచ్చులు వేయకుండా ఎప్పటికప్పుడు అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ సమీప గ్రామాల్లో వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వన్య ప్రాణులకు హానీ తలపెట్టవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నీల్వాయి అడవుల్లో నెముళ్లు, కృష్ణ జింకలు, చు క్కల దుప్పులు, ఎలుగుబంట్లు. అడవి కోళ్లు, కుందేళ్లు, నక్కలు, తోడేళ్లు విరివిగా అడవుల్లో సం చరి స్తున్నట్లు అధికారులు గుర్తించారు. వన్య ప్రాణుల సందడి పెరుగుతున్న కొద్ది ఈ ప్రాంతంలో తరుచుగా పెద్దపులులు సైతం సంచరిస్తున్నాయి.

-వన్యప్రాణులను సంరక్షించేందుకు చర్యలు

ఎఫ్‌ఆర్‌వో అప్పల కొండ, నీల్వాయి

ప్రస్తుతం ఎండాకాలం సమీపించినందున నీల్వాయి రేంజ్‌ పరిధిలోని అడవుల్లో సంచరిస్తున్న వన్య ప్రాణులను సంరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా వేటగాళ్లు వన్య ప్రాణులకు హానీ తలపెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకచర్యలు చేపడుతున్నాం. ప్రజలకు వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో అగ్గి రగల్చకుండా ప్రజలు సహకరించాలి.

Updated Date - Feb 09 , 2025 | 11:43 PM