నాలుగు కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:32 PM
జిల్లాలో కొత్తగా నాలుగు పంచాయతీల ఏర్పాటుకు అధికారు లు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 311 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో ఐదింటిని ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు.
-గెజిట్ నోటిఫికేషన్ విడుదలే తరువాయి
-ఆ తరువాతే పంచాయతీ ఎన్నికలు...?
-కార్పొరేషన్‌లో ఐదు పంచాయతీలు విలీనం
మంచిర్యాల, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా నాలుగు పంచాయతీల ఏర్పాటుకు అధికారు లు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 311 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో ఐదింటిని ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. వాటి స్థానంలో కొత్తగా నాలుగు జీపీలు ఏ ర్పాటైతే మొత్తంగా 310 గ్రామ పంచాయతీలతో జి ల్లా నూతన స్వరూపం ఏర్పాటు కానుంది. జైపూర్, కాసిపేట, జన్నారం మండలాల్లో నాలుగు గ్రామాల ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా గ్రామ పంచాయతీలు గా మారిస్తే ఉపయోగకరంగా ఉంటుందని, ఈ విష యమై అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొత్త జీపీల ఏర్పాటు తరువాతే ఎన్నికలు...!
రాష్ట్రవ్యాప్తంగా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పా టు ఆవకశ్యకత ఉండగా, వాటి ఏర్పాటు తరువాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉ న్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త జీపీల ఏర్పాటు ఆ లోపే జరుగనుంది. పాత పంచాయతీల తో పాటు కొత్త జీపీల్లోనూ ఎన్నికలు జరుగనున్నా యి. జిల్లాలోని జైపూర్ మండలంలోని గోపాల్‌పూర్, కాసిపేట మండలంలోని వరిపేట, జన్నారం మండ లంలోని చర్లపల్లి, మొర్రిగూడ గ్రామాలను పంచాయ తీలు మార్చాలంటూ ప్రభుత్వానికి అఽధికారులు ప్రతి పాదనలు పంపారు. పంచాయతీ ఎన్నికల లోపు ఆయా గ్రామాలను అధికారికంగా ఆప్‌గ్రేడ్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సిసి ఉంది. అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చెందినందున అందులో సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. కార్పొరేషన్ ఏర్పా టుకు సరిపడా జనాభా కోసం హాజీపూర్ మండలం లోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూరు, నర్సిం గాపూర్ పంచాయతీలను అధికారులు కార్పొరేషన్‌లో విలీనం చేశారు.
జనాభా, దూరం ప్రాతిపదికన....
కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం అధికా రులు జనాభా, దూరం ప్రాతిపదికన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలంటే సమీప పంచాయతీ నుంచి కొత్తగా ఏర్పాటు చేయబోయే జీపీ కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉండాలి. అలాగే ఆ గ్రామంలో క నీసం 500 జనాభా ఉండాలి. అప్పుడే గ్రామాలు గ్రా మ పంచాయతీలుగా పదోన్నతి పొందేందుకు నిబం ధనలు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నిబంధనల మే రకు జనాభా, దూరం వంటి ప్రమాణాల ప్రకారం జిల్లాలో నాలుగు పంచాయతీలను ఏర్పాటు చేయాల ని అధికారులు నిర్ణయించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అంద జేశారు.
-జైపూరు మండలంలోని గోపాల్‌పూర్ గ్రామం ప్ర స్తుతం పౌనూరు పంచాయతీలో ఉంది. ప్రస్తుత పం చాయతీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండ డంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర జల డిమాండ్ల మేరకు ఈ గ్రామాన్ని పంచాయతీ గా ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు.
-కాసిపేట మండలంలోని వరిపేటను పంచాయ తీగా ఏర్పాటు చేయాలని శాసన సభ ఎన్నికల వేళ అక్కడి ప్రజలు నిరసన తెలిపారు. వరిపేటను పం చాయతీగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో గామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జన్నారం మం డలంలోని చర్లపల్లి, మొర్రిగూడ గ్రామాలను సైతం ప్రజల సౌకర్యా ర్థం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు.
ఫనిబంధనలు అమలైతేనే..
జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కాబోయే గ్రా మాల్లో నిబంధనలు వర్తిస్తేనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకా శం ఉంది. లేనిపక్షంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకా శం ఉంది. దీంతో నిబంధనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయా లని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో సమగ్రంగా విచారణ జరిపిన అధికారులు ఆ మేరకు ప్రతిపాదన లు అందజేశారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఇంతకాలం ఇతర పంచా యతీల పరిధిలో ఉన్న గ్రామాలు స్వతంత్ర జీపీలు మారు తాయి. ఆయా గ్రామాల్లో సొంతంగా పంచాయతీల పాలన ప్రారం భం కానుంది.
ఎలాంటి ఆదేశాలు అందలేదు..
వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి
నిబంధనల మేరకు జిల్లాలోని నాలుగు పంచాయతీల ఏర్పాటు కు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించా ము. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తేనే కొత్త పంచాయతీలు అమ ల్లోకి వచ్చే అవకాశం ఉంది.