ఐక్యంగా పోరాడితేనే సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:15 PM
బీసీలు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవు తాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యద ర్శులు మణికంఠ, రాజు నేత అన్నారు. కల్వకుర్తి పట్ట ణంలోని యూటీఎఫ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడా రు.

కల్వకుర్తి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : బీసీలు ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవు తాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యద ర్శులు మణికంఠ, రాజు నేత అన్నారు. కల్వకుర్తి పట్ట ణంలోని యూటీఎఫ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడా రు. స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు కావ స్తున్నా తెలంగాణ, ఏపీలలో రెండు కులాలే పరిపాలన సాగిస్తున్నాయని పేర్కొన్నారు. మిగి లిన కులాల వారు రాజకీయ నాయకుల పల్లకి లు మోయడానికే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 77ఏళ్ల స్వాతంత్య్రంలో బీసీలు అన్ని రకాలుగా వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమో దింపజేయాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర సర్వేలో బీసీ కులాల లెక్కలు తక్కువ గా చూపించి వారిని గందరగోళాన్ని సృష్టిస్తు న్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్ర శ్నించారు. బీసీలందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్యయాదవ్, నాయకులు భాస్కర్, రాము, వెంకటయ్య, బీసీ సబ్‌ప్లాన్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజేందర్ తదితరులు ఉన్నారు.