ఏకాగ్రతతో ప్రమాదాల నివారణ
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:45 AM
ఏకాగ్రతతో వాహనం డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమా దాలను నివారించవచ్చని జిల్లా రవాణా శాఖ అధికా రి శ్రీనివాస్ అన్నారు. రోడ్డు జాతీయ భద్రతా మాసో త్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల డిపోలో నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్ర మాదాల నివారణ డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుందన్నారు.

జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్
జగిత్యాల అర్బన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఏకాగ్రతతో వాహనం డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమా దాలను నివారించవచ్చని జిల్లా రవాణా శాఖ అధికా రి శ్రీనివాస్ అన్నారు. రోడ్డు జాతీయ భద్రతా మాసో త్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల డిపోలో నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్ర మాదాల నివారణ డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రతి డ్రైవర్ మద్యపానం సేవించిగానీ, సెల్‌ఫోన్ మాట్లాడుతూగానీ డ్రైవింగ్ చే యడం ప్రమాదమని, అలాగే డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి బస్సులో ఉన్న ప్ర యాణికుల గురించి రోడ్డుపై వెళ్తున్న వారి గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చే యాలని సూచించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువల గురించి తగు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందికి ప్రశం సా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిపో మేనేజర్ సునీత, ఎంవీఐ, బస్ డిపో సిబ్బంది పాల్గొన్నారు.