మోకాళ్లపై కూర్చొని హమాలీల నిరసన
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:12 AM
పెంచిన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలని హమాలీలు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది.

మోకాళ్లపై కూర్చొని హమాలీల నిరసన
నల్లగొండరూరల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పెంచిన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలని హమాలీలు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హమాలీ కార్మికులు వినూత్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసన వ్వక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పల్లే దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ హామీ మేరకు రావాల్సిన బకాయిలు, పెరిగిన జీవోని విడుదల చేయకపోతే సమ్మెని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేఎ్‌సరెడ్డి, వెంకటేశ్వర్లు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.