పేదోళ్ల ఫ్రిజ్‌లు వచ్చేశాయి
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:26 AM
మట్టికుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీల్, ఇతర పాత్రలు వాడుకలోకి రావడంతో మట్టి కుండలకు ఆదరణ క్రమక్రమంగా తగ్గింది.
పేదోళ్ల ఫ్రిజ్‌లు వచ్చేశాయి
వేసవి రావడంతో పెరిగిన విక్రయాలు
మట్టి కుండలో నీరు ఆరోగ్యానికి మేలు
నల్లగొండ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మట్టికుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీల్, ఇతర పాత్రలు వాడుకలోకి రావడంతో మట్టి కుండలకు ఆదరణ క్రమక్రమంగా తగ్గింది. ఆధునిక వంట పాత్రల వాడ కం ద్వారా రోగాలు ప్రజలను చు ట్టుముడుతున్నాయనే భావనతో మరల ప్రజలు మట్టికుండ ల వైపు మళ్లుతున్నట్లు చర్చ సాగుతోంది. చాలా చోట్ల వంటలకు, తాగునీటికి మట్టి కుండలవైపు మొగ్గు చూపుతున్నారు. వేసవిలో మట్టి కుండ లో నీళ్లు తాగడానికే ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫ్రిజ్‌లు అధికశాతం మందికి ఉన్నా ఫ్రిజ్ నీరు తాగితే అనారో గ్యం బారిన పడుతామని కుండనీటిని ఆశ్రయిస్తున్నారు. కుండ నీరు వేసవితాపాన్ని తీర్చడం తో పాటు శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు కుండలను, కూజాలను, పాత్రలను ఆశ్రయిస్తున్నారు. చలివేంద్రా ల్లో సైతం అత్యధికంగా మట్టికుండలనే పెడుతారు. ఈ కుండల్లో నీరు తాగితే దాహం తీరడంతో ఆల్కలిన లక్షణాలు, నీటి పీహెచ స్థాయిలను సమతుల్యం చేస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం
కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమని చెప్పవచ్చు. ఈ నీరు తాగడం వల్ల కడుపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయి. మట్టి కుండల వల్ల కూడ అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లల్లో పెద్ద ఎత్తున మట్టి కుండలను విక్రయిస్తున్నారు. జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన వారంతా నల్లగొండ పట్టణంలో కుండలను, కూజాలను, మట్టి పాత్రలను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లల్లో పెరుగు కోసం ప్రత్యేకంగా తయారుచేసిన మట్టిపాత్రలను రూ.100కు కొనుగోలు చేసిన మహిళలు మట్టి పాత్రలలో పెరుగు ఎంతో నాణ్యత ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉక్కపోతతో పాటు ఎండలు మండుతుండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మట్టి కుండలు అంటేనే చల్లదనానికి మారుపేరు అని చెప్పవచ్చు. ప్రస్తుతం పెద్ద కుండలు రూ.120 నుంచి రూ.200 వరకు కూడా విక్రయిస్తున్నారు. అదేవిధంగా మట్టికుండల్లో పలు రకాలుగా ఉన్నాయి. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. ఇందులో మట్టి, పింగాణి పాత్రలుగా పరిగణిస్తారు. మట్టిపాత్రలను చేతితో తయారు చేసి తక్కువ ఉష్ణోగ్రతలతో కాల్చుతారు.
మట్టి పాత్రలో పెరుగుతో ఆరోగ్యం
జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో పెరుగు కోసం మట్టి పాత్రను కొనుగోలు చేశాను. ఆ పాత్రలో పాలు తోడు పెడితే పెరుగు ఎంతో రుచితో పాటు ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా కుండలో నీటిని కూడా ప్రతీ ఎండకాలం తాగుతుంటాం. కుండల నీరు పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచింది. ఫ్రిజ్‌లో అతిచల్లగా ఉన్న నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం తాము ఎక్కువగా మట్టిపాత్రనే వాడుతున్నాం.
- షబానా బేగం, నల్లగొండ
కుండల నీటితో ఎంతో ప్రయోజనం
తాము ప్రతీరోజు కుండలో నీటిని తాగడానికి ఇష్టపడతాం. వేసవికాలం వచ్చిదంటే ఫ్రిజ్ నీరు తాగకుండా కుండలో నీరు తాగ డానికి మొగ్గు చూపుతాం. ఈ నీరు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచింది. ఫ్రిజ్‌లో నీరు అధికంగా చల్లగా ఉండటం వల్ల అనారోగ్యం బారినపడతారు. డాక్టర్లు కూడా అధికంగా చల్లగా ఉన్న నీరు తాగవద్దని సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కుండలో నీరును తాగుతున్నారు.
- ఎం.రేవతి, అలివేలుమంగాపురం కాలనీ, నల్లగొండ