Share News

పేద రైతులు నష్టపోకుండా చూడాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:34 PM

కల్వకుర్తి - నంద్యాల 167కె జాతీయ రహ దారిలో భాగంగా మండల కేం ద్రమైన తాడూరు వద్ద బైపాస్‌ నిర్మాణంలో భూములు కోల్పో తున్న బాధితులు ఇద్దరు ఇటీ వల పురుగుల మందు తాగి ఆ త్మహత్యకు యత్నించారు

పేద రైతులు నష్టపోకుండా చూడాలి
తాడూరులో పురుగుల మందు తాగి మృతి చెందిన చిన్నయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- భూ నిర్వాసితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

తాడూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి - నంద్యాల 167కె జాతీయ రహ దారిలో భాగంగా మండల కేం ద్రమైన తాడూరు వద్ద బైపాస్‌ నిర్మాణంలో భూములు కోల్పో తున్న బాధితులు ఇద్దరు ఇటీ వల పురుగుల మందు తాగి ఆ త్మహత్యకు యత్నించారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గురువారం తాడూరులో సంబంధిత కురుమూర్తిని పరామ ర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇదిలా ఉంటే చిన్నయ్య అనే రైతు ఇటీవల పు రుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తో ఆకుటుంబాన్ని సైతం మర్రి పరామర్శించా రు. అక్కడి నుంచి చెర్లటి క్యాల గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జానకిరాములు వివాహాది శుభకార్యానికి హాజరై వధూవరుల ను ఆశీర్వదించి అక్కడి నుంచి పాపగల్‌ గ్రా మంలో ఇటీవల కాలంలో మృతి చెందిన వ్యక్తికి రూ. 2లక్షల ఇన్సూరెన్స్‌ చెక్కును కుటుంబ స భ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ ఎస్‌ నాయకులు రమణ, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ సమద్‌పాషా, అనిల్‌రెడ్డి, పర్వతాలు, ఎం డి.జలీల్‌, వివిధ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:34 PM