Share News

Ponnam Prabhakar: కొత్త వారికి రోల్‌మోడల్‌ కావాలి

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:32 AM

ఇతర రాష్ట్రాల్లోని రవాణా శాఖలో భవిష్యత్తులో కొత్తగా విధుల్లో చేరే వారికి రాష్ట్ర రవాణశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)లు రోల్‌ మోడల్‌ కావాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

Ponnam Prabhakar: కొత్త వారికి రోల్‌మోడల్‌ కావాలి

  • ఏఎంవీఐల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో మంత్రి పొన్నం

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లోని రవాణా శాఖలో భవిష్యత్తులో కొత్తగా విధుల్లో చేరే వారికి రాష్ట్ర రవాణశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)లు రోల్‌ మోడల్‌ కావాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణా కేంద్రంలో బుధవారం ఏఎంవీఐల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం.. ఏఎంవీఐల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా వస్తున్న మార్పులకనుగుణంగా పని చేయాలని సూచించారు. 4 నెలలు జరిగిన శిక్షణలో ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అవార్డులు అందించారు.

Updated Date - Jul 10 , 2025 | 03:32 AM