Ponnam Prabhakar: పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:52 AM
సర్వాయి పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సర్వాయి పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. పాపన్న రాజ్యాధికారాన్ని స్థాపించి చరిత్రలో నిలిచారంటే ఆనాటి సామాజిక వర్గాలను కలుపుకొనిపోయి నాయకత్వం వహించినందునే అని పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహరాజ్ ధర్మ పాలన సంస్థ(ఎ్‌సపీడీపీవో), జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఈ ఒక్క సంవత్సరంలోనే 40 లక్షల ఈత మొక్కలు నాటిస్తున్నామని, పాపన్న గౌడ్ వారసులుగా గౌడ వృత్తిని రక్షించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.